తెలంగాణలో సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కోదండరాం గారు రాజకీయ శక్తిగా కూడా ముందకు రావాలని తాను కోరుతున్నట్లు చెప్పారు టిపిసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్. కోదండరాం దీక్షా శిబరానికి హాజరైన డాక్టర్ దాసోజు శ్రవన్ కేసిఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన పాలకపక్షం కాదు. బలమైన ప్రతిపక్షాలు ఉండాలన్నారు. కోదండరాం ఆ దిశగా రాజకీయ శక్తిగా మారాలని కోరారు.

నేడు రాష్ట్రంలో ఉన్న దిక్కుమాలిన సర్కారు వల్ల కోదండరాం ఇంట్లో దీక్ష కు దిగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఇలా దీక్ష కు పూనుకోవడం అత్యంత బాధ కలగుతున్నదన్నారు.  ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్న... అలాంటప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ఆ హక్కును అణిచివేస్తున్నది సర్కారు అని విమర్శించారు.

రాష్ట్రంలో కేసిఆర్ పాలన చూసిన తర్వాత కేసీఆర్  కంటే కిరణ్ కుమార్ రెడ్డి,రోశయ్యే లే బెటర్ అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కోదండరాం ఏమైనా నక్సలైటా? ఎందుకు కొలువుల కొట్లాట సభకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని నిలదీశారు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో టిఆర్ఎస్ నామరూపం లేకుండా పోవడం ఖాయమన్నారు. ప్రజలను కాపాడడం కోసమైన రాజకీయాల్లోకి రావాలని కోదండరాం కు సూచించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ  కేసిఆర్ కు ఇపుడు jac ఒక శత్రువు అయిపోయిందా అని ప్రశ్నించారు. గత పాలకుల కంటే ఇపుడు ఉన్న కేసీఆర్  పాలన చాలా దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ బలుపు ఎక్కి మాట్లాడుతున్నాడని విమర్శించారు. పనికి రాని దద్దమ్మలను పక్కన పెట్టుకొని ఎగురుతున్నావ్.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

పనికి రాని సన్నాసులను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నావా అని నిలదీశారు. ఉద్యమం లో పాల్గొనని నాయకులకు పదవులు కట్టబెట్టిన ఘనత కేసీఆర్ దే అన్నారు. శవాల పై రాజకీయాలు చేసే వ్యక్తి కేసిఆర్ అని విమర్శించారు. కోదండరాం ని కూల్చడం అంటే ప్రజల్ని కూల్చడమే అని ఆందోళన వ్యక్తం చేశారు.

గతం లో సమైక్య రాష్ట్రం వున్నపుడు అయినా ప్రజల గొంతు వినిపించుకోడానికి సమస్యలు తెలుకోడానికి అనుమతిలు ఇచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎవడైనా సరే మరో సారి కొందండరాం ను వాడు వీడు అని విమర్శిస్తే చేట్టుకు కట్టేస్తామని హెచ్చరించారు.

24 గంటల తర్వాత కోదండరాం దీక్షను విరమించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ విద్యావేత్త చుక్కా  రామయ్య చేతుల మీదుగా దీక్షను విరమింపజేశారు.

కోదండరాం తో చేతులు కలిపిన టిడిపి తమ్ముళ్లు

ఈ వీడియో తోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/VWL5nc