హైదరాబాద్: ఆర్టీసీ  విభజన జరగనప్పుడు ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొన్న విలీన నిర్ణయం తెలంగాణలో కూడ వర్తిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు.  ఆర్టీసీ కార్మికుల సభకు మద్దతుగా సరూర్‌నగర్  స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరీ సభలో  ఆయన పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల జేఎసీ  సమ్మెకు మద్దతుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా సకల జనుల సమరభేరీ సభ నిర్వహించారు.ఈ సభలో  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, టీడీపీ నేలు పాల్గొని మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తాము తమ మేనిఫెస్టోలో  చెప్పలేదని  సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

also read Sakalajanula Samarabheri photos ; కిక్కిరిసిన సమరభేరీ ...

మేనిఫెస్టోలో కూడ లేని అంశాలను ఎలా ముందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డికి ఆర్టీసీలో కొంత భాగాన్ని ఎలా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తారని ఆయన నిలదీశారు.

ఆర్టీసీ విభజన ఇంకా ఫూర్తి కాలేదని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆస్తులు, అప్పులు పంచుకోకపోతే ఏపీ, తెలంగాణలోని ఆర్టీసీ ఒకే సంస్థగా పరిగణించాల్సి వస్తోందన్నారు. 

also read  హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు, ఆర్టీసీకి రూ. 47 కోట్లివ్వలేరా?: హైకోర్టు ...

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ రాష్ట్రం తీసుకొన్న నిర్ణయం తెలంగాణలో కూడ వర్తిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో కేసీఆర్ సర్కార్ కు చీమ కుట్టినట్టుగా కూడ లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి ప్రగతి భవన్ ను ముట్టడించినట్టుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

 also read rtc strike: లెక్కలన్నీ ఉత్తయే.. ప్రభుత్వానికి కోర్టు మెుట్టికాయలు: అశ్వత్థామరెడ్డి ...

విమానాలకు ఉపయోగించే ఇంధనానికి మాత్రం సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీ ఉపయోగించే డీజీల్‌పై మాత్రం పన్నును ఎందుకు  ఎత్తివేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా నిలుస్తామని  ఆయన హామీ ఇచ్చారు.

also read  rtc strike: లెక్కలన్నీ ఉత్తయే.. ప్రభుత్వానికి కోర్టు మెుట్టికాయలు: అశ్వత్థామరెడ్డి ...