తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తుండగా.. మిగిలిన పార్టీలు ఇప్పుడిప్పుడే ఆ స్పీడ్‌ను అందుకోవడానికి యత్నిస్తున్నాయి.

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాఫ్టర్ ద్వారా రోజుకు నాలుగైదు సభల్లో పాల్గొంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేటీఆర్ రోడ్ షోలు, కవిత, హరీశ్‌లు సభలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు.

ఈ క్రమంలో మహాకూటమి నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా దూకుడు పెంచారు. సీఎంను అనుసరిస్తూ ఆయన కూడా హెలికాఫ్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

నిన్న కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగించిందన్నారు.

ఇందుకోసం హెలికాఫ్టర్‌నే కూడా సమకూర్చారని ఆయన వెల్లడించారు. కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్