రేపు హైద్రాబాద్ కు మాణికం ఠాగూర్: మునుగోడులో అభ్యర్ధి ఎంపికపై కసరత్తు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రేపు హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికపై  పార్టీ నేతలతో చర్చించనున్నారు. 

Congress leader Manickam Tagore To Reach Hyderabad On August 24

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రేపు హైద్రాబాద్ కు రానున్నారు.  మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్ధి ఎంపిక విషయమై కసరత్తు చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సోమవారం నాడు సోనియాగాంధీ నివాసంలో ప్రియాంకగాంధీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన నేతలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ విడి విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అందరితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ నేతల మధ్య సమన్వయలోపంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.  రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించాలని ఆమె సూచించారు. అంతేకాదు పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా చర్చించాలని సూచించారు.

ఈ సమావేశానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జీ పదవి నుండి మాణికం ఠాగూర్ ను , టీపీసీసీ చీప్ పదవి నుండి రేవంత్ రెడ్డిని కూడా తప్పించాలని డిమాండ్  చేశారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఈ స్థానంలో పోటీకయి దింపే అభ్యర్ధిని ఫైనల్ చేసే విషయమై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తులు చేయనుంది.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రానున్నారు.  మునుగోడు ఉప ఎన్నికల విషయమై చర్చించనున్నారు. 

also read:ఆత్మాభిమానం ఎక్కువ, ఆ ఇద్దరిని తొలగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాల్వాయి స్రవంతి రెడ్డి, కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్,  చెరుకు సుధాకర్ వంటి పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. అయితే ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్ పార్టీ ఆయాా గ్రామాల్లో నేతల నుండి కూడా అభ్యర్ధి ఎంపికపై సమాచారం సేకరిస్తుంది. మరో వైపు ఈ నియోజకవర్గంలో అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కూడ కాంగ్రెస్ పార్టీ స్వంతంగా సర్వేలు నిర్వహిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios