హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చెప్పారు.శుక్రవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అరాచకపాలనకు రేవంత్ రెడ్డి అరెస్ట్ నిదర్శనమన్నారు. 

Also read:గోపన్‌పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు

రేవంత్ రెడ్డిపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కుంతియా డిమాండ్ చేశారు.  కేసీఆర్ అవినీతిని ఎండగడుతున్నారనే రేవంత్ రెడ్డిపై కక్ష పెంచుకొన్నారని  ఆయన ఆరోపించారు. 

కేటీఆర్ 111 జీవో పరిధిలో లక్ష అడుగుల రాజభవనాన్ని నిర్మించలేదా అని ఆయన ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు ఉందని కుంతియా స్పష్టం చేశారు. రేవంత్ పై బనాయించిన కేసులను ఎత్తివేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

తన ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారా లేదా అనే విషయమై ప్రకటించి  తన నిజాయితీని నిరూపించుకోవాలని  కుంతియా కోరారు. 

కేటీఆర్ లీజ్ కు తీసుకొన్న ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలను వీడియోలను తీశారనే నెపంతో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని గురువారం నాడు  అరెస్ట్ చేశారు. పార్లమెంట్ నుండి హైద్రాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.