చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను వినియోగించిన కేసులు కాంగ్రెస్ ఎంపీ, రేవంత్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను వినియోగించిన కేసులు కాంగ్రెస్ ఎంపీ, రేవంత్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి సమీపంలోని జన్వాడలో ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫాం హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ విధించడంతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్‌గా గుర్తించారు. అయితే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరేశ్‌లపై విచారణ కొనసాగుతోంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 184, 187 కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఐదుగురిని రిమాండ్‌కు సైతం తరలించారు.
Also Read:గోపన్‌పల్లి భూములు: హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిలను విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారిద్దరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో గురువారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి వెంటనే నార్సింగి పీఎస్‌కు తరలించారు. కేటీఆర్ ఫాం హౌస్ ఉన్న ప్రాంతం నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రోన్ ఆపరేటర్ ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేసి, దృశ్యాలను చిత్రీకరించారని పోలీసులు చెబుతున్నారు.
Also Read:కేటీఆర్ ఫాం హౌస్‌పై డ్రోన్: ఎయిర్‌పోర్టులో రేవంత్ అరెస్ట్
ఎయిర్‌పోర్టు నుంచి పీఎస్‌కు చేరుకున్న రేవంత్‌కు విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రేవంత్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.