Asianet News TeluguAsianet News Telugu

గోపన్‌పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు

గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. 
 

High court orders government to take as per law over gopanpally lands
Author
Hyderabad, First Published Mar 6, 2020, 2:26 PM IST

హైదరాబాద్: గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. 

గోపన్‌పల్లి భూముల వ్యవహరంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు  హైకోర్టు విచారణ చేసింది. గురువారం నాడు ఈ భూముల విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also read:గోపన్‌పల్లి భూములు: హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి

ఈ పిటిషన్‌పై  శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ భూముల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని  హైకోర్టు సూచించింది.

మరో వైపు తమకు ఎలాంటి నోటీసులు కూడ ఇవ్వలేదని ఏపీ హైకోర్టుకు రేవంత్ తరపున న్యాయవాది గుర్తు చేశారు. అయితే ఈ విషయమై ప్రభుత్వ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని  ఏ చర్యలు తీసుకొన్నా కూడ  ముందుగా రేవంత్ రెడ్డి సోదరులకు నోటీసులు ఇస్తామని  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.ఈ కేసు విచారణను హైకోర్టు ముగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios