కలెక్టొరేట్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

congress leader jaggareddy lays siege to sangareddy collectorate
Highlights

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద  ఎత్తున  సంగారెడ్డి క కలెక్టరేట్ ను ముట్టడించే యత్నం చేశారు. అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్  ని  బర్తరఫ్ చేయడానికి నిరసనగా కలెక్టరేట్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది. రాహుల్  సంగారెడ్డి పర్యటన  విజయవంతమయిన నేపథ్యంలో  జిల్లాలో  రాజకీయ వాతావరణం ఉద్రికత్తమవుతూ ఉంది.

 

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద  ఎత్తున  సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించే యత్నం చేశారు. 

అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్  బర్తరఫ్ చేయడానికి నిరసనగా కలెక్టరేట్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది.

రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడంలో జగ్గారెడ్డి, ఆయన అనుచరవర్గం బాగా కృషి చేసినందుకు టిఆర్  ఎస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉందని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు.

ఈ ప్రతీకార చర్యలలో భాగంగా అమీన్ పూర్ సర్పంచ్ జిల్లా కలెక్టర్ పదవినుంచి తొలగించారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ బర్తరఫ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ  ఆయన అనుచరులతో కలెక్టొరేట్ ను  ముట్టడించారు.

టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అయితే, తాము భయపడేది లేదని ఆయన చెప్పారు.

రాహుల్ సభ సక్సెస్ తో టీఆర్ఎస్ లో ఉలికిపాటుపడుతూ ఉందని ఆయన ఆరోపించారు.

నీటి పారుదల మంత్రి హారీశ్ రావు  చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని కూడ ఆయన కోరారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
.

 

loader