గాంధీ భవన్ లో కరోనా టెన్షన్... కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతితో

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ బారిన సామాన్యులే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా పడుతున్నారు. 

Congress Leader Died Due To Coronavirus In  hyderabad

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ బారిన సామాన్యులే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా పడుతున్నారు. ఇలా కరోనా సోకి గతకొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ యాదవ్ మృత్యువాతపడ్డారు. 

లాక్ డౌన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాద్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు నరేందర్. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఆయన మృతితో కుటుంబసభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదేక్రమంలో ఆయనతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది. దీంతో అనుమానం వున్నవారు టెస్టులు చేయించుకుంటున్నారు. అలాగే నరేందర్ యాదవ్ ఈ మధ్య పలుమార్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు కూడా వెళ్లాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యాలయ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

read more   కరోనా వైరస్ మృతుడికి అంత్యక్రియలు: మానవత్వం చాటుకున్న డాక్టర్ 

మొత్తంగా తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. వైరస్ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 28,482 మంది కోలుకుని డిశ్చార్జవ్వగా... 11,883 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఒక్క హైదరాబాద్‌లోనే 800 మందికి పాజిటివ్‌గా తేలగా... రంగారెడ్డి 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ అర్బన్ 12, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 4, కరీంనగర్ 23, జగిత్యాల 4, యాదాద్రి 7, మహబూబాబాద్ 8, పెద్దపల్లి 9, మెదక్ 14, మహబూబ్‌నగర్ 17, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలో మూడేసి కేసులు, నల్గొండ 15, సిరిసిల్ల 3, ఆదిలాబాద్ 4, వికారాబాద్‌ 6, నాగర్‌కర్నూల్ 23, జనగాం 6, నిజామాబాద్ 11, వనపర్తి 15, సిద్ధిపేట 3, సూర్యాపేట 7, గద్వాల్‌ 7 కేసులు నమోదయ్యాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios