కాంగ్రెస్ రైతు వ్యతిరేకి.. ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి హరీశ్ రావు
Hyderabad: రైతుల విద్యుత్ అవసరాలను కాంగ్రెస్ విస్మరించిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎలా నిర్లక్ష్యం చేశారనే విషయాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Telangana finance minister T Harish Rao: రైతులకు విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రైతుల విద్యుత్ అవసరాలను కాంగ్రెస్ విస్మరించిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏలా నిర్లక్ష్యం చేశారనే విషయాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల రైతులకు ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల విద్యుత్ అవసరాలను కాంగ్రెస్ నేతలు విస్మరించారనీ, కేవలం మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాలుగైదు గంటల కరెంట్ ఉండేదని అన్నారు. అయితే, ప్రస్తుతం మూడు పంటలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచాలన్నదే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) లక్ష్యమన్నారు. దీనికి అనుగునంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ లేకపోవడం దురదృష్టకర వాస్తవమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేసిన తీరును ప్రజలకు గుర్తు చేశారు. దీనికితోడు బోరుబావులకు మీటర్లు బిగించాలన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో రైతులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చంద్రబాబును కోరారని హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే అప్పుటి నిరసనలో రైతులపై కాల్పులు జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారని, ఆ తర్వాత తెలంగాణ కోసం పోరాడేందుకు, రైతుల సమస్యలను పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కాంగ్రెస్ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసిన పార్టీ నేత దాసోజు శ్రవణ్ పై బెదిరింపులు రావడాన్ని మంత్రి హరీశ్ రావు ఖండించారు. బెదిరింపులు, బలవంతం మానుకోవాలని, నిర్మాణాత్మక రాజకీయ చర్చలు, చర్యలు జరగాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సమస్యపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.