Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సినేషన్: సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష

కరోనా వ్యాక్సినేషన్‌పై  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పది రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.  కరోనా వ్యాక్సిన్  డోసులు నిలిచిపోవడంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. 

CM KCR reviews on Corona vaccination lns
Author
Hyderabad, First Published May 24, 2021, 4:06 PM IST

హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్‌పై  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పది రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.  కరోనా వ్యాక్సిన్  డోసులు నిలిచిపోవడంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.గ్యాస్ డెలివరీ బోయ్స్, కూరగయాల వ్యాపారులు, చిరు వ్యాపారులకు తొలుత వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా  వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గాను గ్లోబల్ టెండర్లను కూడ పిలిచింది ప్రభుత్వం. జూన్ 4 వరకు  టెండర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

also read:తెలంగాణలో కరోనా వ్యాక్సిన్: గ్లోబల్ టెండర్లు పిలిచిన కేసీఆర్ సర్కార్

ప్రతి నెలా 15 లక్షల కరోనా వ్యాక్సిన్ టెండర్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఆరు నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని షార్ట్ టెండర్ నోటీసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ను విధించింది. ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios