తెలంగాణలో కరోనా వ్యాక్సిన్: గ్లోబల్ టెండర్లు పిలిచిన కేసీఆర్ సర్కార్
రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు గ్లోబల్ టెండర్లు పిలిచింది. షార్ట్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది.
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు గ్లోబల్ టెండర్లు పిలిచింది. షార్ట్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది. ఈ నెల మొదటివారంలో కేబినెట్ సమావేశంలో వ్యాక్సిన్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లన పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గ్లోబల్ టెండర్లు పిలిచింది.
ఈ ఏడాది జూన్ 4వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువును ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి నెలా 15 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాలని ఆ టెండర్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే గ్లోబల్ టెండర్లను ప్రభుత్వంపిలిచింది. ఆరు మాసాల్లో మొత్తం 10 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఇవ్వాలని ఈ టెండర్ నోటీసులో ప్రభుత్వం కోరింది. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను తప్పించిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖను సీఎం తన వద్దే ఉంచుకొన్నారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకొన్న తర్వాత కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.