సర్కారు దవాఖానాలో ప్రసవాలను పెంచాలని సీఎం కేసీఆర్ అంగన్ వాడి కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ప్రాంగణంలో ఉన్న జనహితలో అంగన్ వాడి కార్యకర్తలు, సహాయకులతో సమావేశమయ్యారు

 

ప్రైవేట్ ఆస్పత్రుల కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నామని క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీదేనని గుర్తు చేశారు.

 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఒక వేళ ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇచ్చే విధంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.  మూడు విడతల్లో నాలుగు వేల చొప్పున చెల్లిస్తామన్నారు.

 

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు గ్రాముల్లో ఆహారం పెట్టొద్దని, వారు తిన్నంత భోజనం పెట్టాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు.

 

 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని, గర్భ సంచులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. వీటివల్ల కొందరు చనిపోవడం బాధాకరం అన్నారు.