సాయంత్రం 4.40 కి ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్న సీం కేసీఆర్ ... ప్రధానితో ఇదే విషయమై ప్రదానంగా చర్చించే అవకాశం ఉంది.
సాయంత్రం 4:40 గంటలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడటంతో ఆ లోటు భర్తీచేయాలని కోరే అవకాశం ఉంది. ప్రధానంగా ఐదు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చేలా నివేదికను తయారు చేశారు.
నోట్ల రద్దుతో వచ్చే 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.3250 కోట్ల నష్టం జరుగుతుందంటూ ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు.
అలాగే నోట్ల రద్దుతో వస్తుసేవలు, వాణిజ్యపన్నుల ఆదాయం, రవాణాశాఖ, ఎక్సైజ్ ఆదాయం చాలా వరక కోత పడిందని, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని, రిజిస్ట్రేషన్, రవాణా విభాగంలో ఆదాయం బాగా తగ్గిందని ప్రధానికి వివరించనున్నారు.
రాష్ట్ర ఆదాయానికి గండి పడటంతో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరే అవకాశం ఉంది.
