గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

Also Read:కొల్లాపూర్‌లో జూపల్లికి షాక్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిదే పై చేయి

అంతకుముందు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. హైద్రాబాద్‌ వరల్డ్ క్లాస్ సిటీ అంటూ తమిళిసై గుర్తు చేశారు. గత ఆరేళ్లుగా అభివృద్ధి కోసం గట్టి పునాదులు పడిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.  

అన్ని రంగాల్లో అభివృద్ధిలో  ముందుకు సాగుతున్నా.. అక్షరాస్యతలో వెనుకబడిన విషయాన్ని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. అక్షరాస్యతలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను  ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని విద్యావంతుల్ని చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.  

Also Read:కారణమిదే: రెబెల్స్‌కు టీఆర్ఎస్‌కు చెక్

రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం దేశానికే ఆదర్శమని గవర్నర్ చెప్పారు.