న్యూఢిల్లీ:అధికార టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులకు గట్టిగానే షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కఠినంగా అమలు చేయాలంటే ఈ ఎన్నికలనే అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించింది.

Also read: విపక్షాలను చిత్తు చేసిన టీఆర్ఎస్‌: బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఇదీ...

రెబల్ గా బరిలో నిలిచి విజయం సాధించిన అభ్యర్థులకు ఎలాంటి సహకారం అందించరాదన్న అభిప్రాయంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరుతామున్న సంకేతాలు ఇప్పటికే రెబల్ అభ్యర్థులు ఇస్తున్నా వారిని దూరంగానే ఉంచాలనే అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం.

 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల రెబల్స్ సహకారంతో  సులువుగా గట్టెక్కే అవకాశం ఉన్నా పార్టీకి ఉన్న ఎక్స్ అఫిషియో ఓట్లతోనే ఆ మున్సిపాల్టీల్లో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది.

కొల్లాపూర్ మునిసిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది  ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించిన నేతలు అధికార పార్టీ నుంచి టికెట్లు దొరకకపోవడంతో చాలా మున్సిపాలిటీలో రెబల్ గా బరిలో దిగిన అభ్యర్ధులు విజయం సాధించారు.

ఎన్నికల ప్రచారంలో కూడా తాము  విజయం సాధించినా టిఆర్ఎస్ పార్టీలో చెరుతామని  చెప్పుకున్నారు. ఆయినా పార్టీ పరంగా మాత్రం టీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసిన వాళ్లే టిఆర్ఎస్ అభ్యర్థులగా స్పష్టమైన ప్రకటనను పార్టీ నేతలు చేశారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల మున్సిపాలిటీ లో కూడా రెబల్స్ భారీగానే విజయం సాధించారు.

 టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఆ మున్సిపాలిటీల్లో రావడంతో ఇక రెబల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో కూడా దగ్గర నేర్చుకోరాదన్న అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.

 పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో ఓటర్ల తో పాటు స్వతంత్రులు విజయం సాధించినట్లు అయితే వారిని పార్టీలో చేర్చుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది రేపటితో ఈ సమీకరణలకు తెరపడనుంది.

పార్టీ ఎన్నికలకు ముందు సేకరించిన సమాచారం ప్రకారం విజయం సాధించిన అభ్యర్థులను పార్టీలో చేసుకోవాలా వద్దా అని చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది.