మహబూబ్‌నగర్:  పాలమూరు జిల్లాలో ఉత్కంఠ రేపిన మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి మధ్య అధిపత్య పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది. జూపల్లి వర్గం రెండు మున్సిపాల్టీలో మెజార్టీ సీట్లు దక్కించుకున్నా సింగిరెడ్డి వ్యూహంతో జూపల్లి పార్టీలో మరింత ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి.

Also read:జూపల్లికి టీఆర్ఎస్‌ ఝలక్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ..

Also read: కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

 రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నేతలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా  రాజకీయంగా పట్టు నిరూపించుకునేందుకు  పావులు కదిపారు. కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి జూపల్లి తన అనుచరులతో రంగంలోకి దించి మున్సిపాల్టీల్లో 11,10 స్థానాలను గెలుచుకున్నారు. 

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

ఆ  రెండు మున్సిపాల్టీలో అధికార పార్టీ  నేతలకు తక్కువగానే స్థానాలు వచ్చినా...రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన జూపల్లి వర్గం నేతలు క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని చాటుకున్నారు. అయితే అధికార పార్టీగా కలిసి వచ్చే అంశాలను వినియోగించుకుని మంత్రి నిరంజన్ రెడ్డి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. 

Also read:కారణమిదే: రెబెల్స్‌కు టీఆర్ఎస్‌కు చెక్

కొల్లాపూర్ లో ఎక్స్ అఫిషియో ఓట్లతో గట్టెక్కాలని ఎక్స్ అఫిషియో ఓటర్లను కొల్లాపూర్ మున్సిపాల్టీకి ముగ్గురిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయిజ మున్సిపాల్టీలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులను కారెక్కించుకుని చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నా మంత్రి మాత్రం రెబల్స్ తో అవసరం లేకుండా చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. మున్సిపల్ ఎన్నికలతో జూపల్లి వర్గానికి పాలమూరు జిల్లాలో చెక్ పెట్టేందుకు నిరంజన్ రెడ్డి  పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది.