కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరికి గాయాలు..
వరంగల్ లో ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీలో స్టూడెంట్ల మధ్య ఈ నెల 14వ తేదీన గొడవ జరిగింది. ఇందులో ఒకరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆ స్టూడెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది.

వరంగల్ లో ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీలో పలువురు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన పోలీసు స్టేషన్ వరకు చేసింది. దీనిపై వారు కేసు నమోదు చేసుకున్నారు. మెడికల్ స్టూడెంట్ల మధ్య ఈ నెల 14వ తేదీన ఘర్షణ జరిగింది. ఆ రోజు కాలేజీలో మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్న పలువురు స్టూడెంట్లు సెకెండియర్ చదువుతున్న ఓ స్టూడెంట్ ను వేధింపులకు గురి చేశారు.
దారుణం.. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాలువలో తోసేసిన తల్లి.. ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు
దీంతో అతడికి గాయాలు అయ్యాయి. వెంటనే బాధితుడు ఈ ఘటనపై మట్టెవాడ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపారు. ఆరుగురు సీనియర్ స్టూడెంట్లపై శనివారం కేసు బుక్ చేశారు. అయితే ఇది ర్యాంగింగ్ కాదని, స్టూడెంట్ల మధ్య ఘర్షణ మాత్రమే అని ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు ‘న్యూస్ టుడే’తో తెలిపారు. ఈ ఘర్షణకు కారణమైన స్టూడెంట్ల తల్లిదండ్రులను కాలేజీకి పిలిపించామని చెప్పారు.
తెలంగాణ విమోచన దినోత్సవం : హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు
వారితో మాట్లాడామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ర్యాగింగ్ నిరోధక కమిటీలో చర్చిస్తామని తెలిపారు. తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. ఇటీవల హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ ఘటన బయటకు వచ్చింది. కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఫిర్యాదును కాలేజీ యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. ఆ పది మంది సీనియర్ విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఏ విద్యాసంస్థల్లోనైనా విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.