Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ విమోచన దినోత్సవం : హైదరాబాద్‌‌కు చేరుకున్న అమిత్ షా.. ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీబీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. రేపు తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు.

union home minister amit shah reached hyderabad ksp
Author
First Published Sep 16, 2023, 8:26 PM IST

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీబీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. రేపు తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు. అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో అమిత్ షా భేటీ కానున్నారు. 

గత ఏడాది కూడా  కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ దఫా  కూడ  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఇందులో భాగంగానే  ఈ నెల  17న  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

ALso Read: అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక పరిణామం .. భేటీకానున్న పీవీ సింధు

ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని  బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు  బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.  తెలంగాణ విమోచన దినోత్సవం  సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత  రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని  బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలో మూడు చోట్ల నుండి  బస్సు యాత్రలు  ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రల ముగింపు  సందర్భంగా  హైద్రాబాద్‌లో మరో సభను కూడా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios