హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని చిత్రా లేఔట్‌లో మంజీరా హైట్స్ డీ బ్లాక్‌లో నివసిస్తున్న ఓ సీఐ అపార్ట్‌మెంట్‌వాసులపై కుక్కలను వదులుతున్నాడు. ఎల్బీ నగర్ పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని చిత్రా లేఔట్‌లో దారుణం జరిగింది. అక్కడి మంజీరా హైట్స్ డీ బ్లాక్‌లో నివసిస్తున్న ఓ సీఐ అపార్ట్‌మెంట్‌వాసులపై కుక్కలను వదులుతున్నాడు. కుక్కల భయంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనదైన శైలిలో బెదిరిస్తున్నాడు. గత వారం ఓ మహిళా గైనకాలజిస్ట్ పైకి రెండు పెంపుడు కుక్కల్ని వదిలాడు సీఐ . ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్బీ నగర్ పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో సీఐ కుక్కల్ని వదిలిన వీడియోలు, బెదిరింపులకు పాల్పడిన వీడియోలు రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.