వారంతా నా కూతుళ్లతో సమానం: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఓఎస్‌డీ హరికృష్ణ

హకింపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై   లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా  ఆరోపణలపై  ఓఎస్డీ  హరికృష్ణ స్పందించారు.  తనపై బురద చల్లుతున్నారన్నారు

Hakimpet  Sports  School OSD  Hari Krishna Responds  On  Sexual Harassment Allegations lns

హైదరాబాద్: స్పోర్ట్స్ స్కూల్ లో  ఉండే బాలికలు  తనకు కూతుళ్లతో సమానమని  హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ హరికృష్ణ చెప్పారు.హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో  బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా  ఓఎస్డీ హరికృష్ణపై  మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ కథనాలపై హరికృష్ణ ఆదివారంనాడు స్పందించారు. పలు మీడియా ప్రతినిధులతో  హరికృష్ణ  ఇంటర్వ్యూలు  ఇచ్చారు.

also read:హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులు, ఓఎస్‌డీ సస్పెన్షన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తనపై  వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. స్పోర్ట్స్ స్కూల్స్ లో  సెలెక్షన్ జరిగే సమయంలో ఇలాంటి ఆరోపణలు జరగడంపై  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పై  బురద చల్లేందుకు  ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను  ఎవరిపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డానో  రుజువు చేయాలని ఆయన  డిమాండ్  చేశారు.  స్పోర్ట్స్ స్కూల్ లో ఉండే  వారిని  విచారించాలని ఆయన  కోరారు. తనపై వచ్చిన ఆరోపణలపై  సమగ్రంగా  విచారణ జరిపించాలని  హరికృష్ణ డిమాండ్  చేశారు.

బాలికల హస్టల్ కు  పురుషులు ఎవరు వెళ్లరని ఆయన  చెప్పారు. కరోనా సమయంలో కూడ  తాను  ఇక్కడే  ఉన్నట్టుగా  ఓఎస్‌డీ గుర్తు చేశారు.ఎవరైనా తప్పు చేస్తే  వారిని గట్టిగా మందలిస్తానని  ఓఎస్‌డీ హరికృష్ణ చెప్పారు.తాను ఎవరిని వేధించలేదని ఆయన వివరించారు.హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో  ఓఎస్డీకి అక్కడ పనిచేసే కొందరికి  మధ్య విబేధాలున్నాయనే  ప్రచారం ఉంది. అయితే  తనకు గిట్టని వాళ్లు ఈ ప్రచారం చేయడానికి కారణమయ్యారా అనే విషయమై మీడియా ప్రశ్నలకు  సమాధానం చెప్పడానికి  హరికృష్ణ నిరాకరించారు.

ఇవాళ ఉదయమే  తన స్నేహితులు ఫోన్ చేసిన చెబితేనే  మీడియాలో తనపై  వార్త వచ్చిందనే విషయం తెలిసిందని  హరికృష్ణ చెప్పారు.  హకీంపేట స్కూల్ లో ఏం జరుగుతుందో  వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  బాలికల హస్టల్ వైపు మహిళ ఉద్యోగులు లేనిదే  ఎవరూడ కూడ అడుగుపెట్టరని  హరికృష్ణ వివరించారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios