Asianet News TeluguAsianet News Telugu

నేను రౌడీయిజం చేస్తే జగన్ బయటకు వచ్చేవాడా?: చంద్రబాబు


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగినట్టుగా చంద్రబాబు చెప్పారు.ఈ ఎన్నికలను బహిష్కరించినట్టుగా చంద్రబాబు తెలిపారు. సోమవారం నాడు చంద్రబాబునాయుడు మందకృష్ణమాదిగను పరామర్శించారు.

Chandrababu serious comments on YS Jagan
Author
Hyderabad, First Published Sep 20, 2021, 7:02 PM IST


హైదరాబాద్: తాను  రౌడీయిజం చేయాలనుకుంటే జగన్ బయటకు వచ్చేవాడు కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు.. ఈ ఎన్నికలను తాము బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:మేం వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని కేకలేయడమేంటి? వైసీపీపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ విమర్శలు

సోమవారం నాడు ఎంఆర్‌పీఎస్  నేత మందకృష్ణ మాదిగను హైద్రాబాద్ లోని అంబర్‌పేటలో  చంద్రబాబునాయుడు పరామర్శించారు. మందకృష్ణ మాదిగ ఇటీవల బాత్‌రూమ్ లో కాలుజారిపడి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో కలిసి ఇవాళ మందకృష్ణను పరామర్శించారు.

"

ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు.వైసిపి పార్టీ  నేతలకు నేరాలు-ఘోరాలు చేయడం అలవాటేనని చంద్రబాబు విమర్శించారు.

ఇప్పుడు కూడా వైసిపి వాళ్ళు ఏమి చేయలేరన్నారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలిపారు.తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం రికార్డ్ అని ఆయన తెలిపారు.ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటే  తెలంగాణలో కూడా దారుణంగా ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ కి  నేరాలు-ఘోరాలు చేయడం అలవాటేనని చంద్రబాబు విమర్శించారు.
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేరాలు చేయలేదని చంద్రబాబు చెప్పారు.

ఏపీలో టీడీపీ ఎవరు ఏం చేయలేరని చంద్రబాబు ధీమాను వ్యక్తం చేశారు. జగన్ పెట్టివన్నీ తాత్కాలిక ఇబ్బందులేనని ఆయన అన్నారు.ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందన్నారు. తనలాంటి నేత మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తెలంగాణలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నా మీదనే తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు చెప్పారు.ఎప్పుడు ఎబిసిడి వర్గీకరణ కోసం పని చేసుకుంటూ వచ్చానని ఆయన తెలిపారు.మందకృష్ణ మాదిగ కాలికి గాయం కావడం దురదృష్టకరమన్నారు. మందకృష్ణ కోలుకొంటున్నారని చంద్రబాబు చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios