Asianet News TeluguAsianet News Telugu

జైల్లోనే...హేమంత్ హత్యకేసులో నిందితుడికి కరోనా

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో వున్న నిందితుడికి కరోనా సోకింది. 

chandanagar murder case... suspect infected with corona
Author
Hyderabad, First Published Oct 8, 2020, 7:56 AM IST

హైదరాబాద్: తెలంగాణలో  సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో నిందితుడు బిచ్చుయాదవ్ కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా సోకడంతో పోలీస్ కస్టడీకి అప్పగించలేదని జైలు అధికారులు వెల్లడించారు. అతడికి ప్రత్యేకంగా కరోనా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులయిన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమాయ యుగేంధర్ రెడ్డిలను పోలీసులు ఆరు రోజులు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మిగతా నిందితులను కూడా విచారించాలని కోరగా ఎల్బీ నగర్ కోర్టు 3రోజులు కస్టడీకి అనుమతిచ్చింది. అయితే ఈ క్రమంలోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా బిచ్చుయాదవ్ కు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

దీంతో ఈ విషయాన్ని న్యాయస్థానానికి తెలిపిన జైలు అధికారులు పోలీస్ కస్టడీకి అప్పగించకుండా జైల్లోనే వుంచారు. మిగతా ఆరుగురు నిందితులకు నెగెటివ్ గా తేలడంతో వారిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. 

 read more హేమంత్ హత్య కేసు: అవంతి విజ్ఞప్తి.. స్పందించిన సజ్జనార్

ఈ హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులయిన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమాయ యుగేంధర్ రెడ్డిలను పోలీసులు ఆరు రోజులు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మిగతా నిందితులను కూడా విచారించాలని కోరగా ఎల్బీ నగర్ కోర్టు 3రోజులు కస్టడీకి అనుమతిచ్చింది. అయితే ఈ క్రమంలోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా బిచ్చుయాదవ్ కు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

దీంతో ఈ విషయాన్ని న్యాయస్థానానికి తెలిపిన జైలు అధికారులు పోలీస్ కస్టడీకి అప్పగించకుండా జైల్లోనే వుంచారు. మిగతా ఆరుగురు నిందితులకు నెగెటివ్ గా తేలడంతో వారిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. 

మరోవైపు హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.హేమంత్ హత్య కేసులో సుఫారీ గ్యాంగ్ కు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. 

హేమంత్ ను హత్య చేయించేందుకు రూ. 30 లక్షలకు సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే రూ. 10 లక్షలను చెల్లించారన్నారు.
  
Follow Us:
Download App:
  • android
  • ios