హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్.. వృద్దురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు..

హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చిలకలగూడలో వృద్దురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను దుండగుడు లాక్కెళ్లాడు.

chain snatching in hyderabad chilakalguda ksm

హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చిలకలగూడలో వృద్దురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లాడు. అయితే  ఈ ఘటనలో కిందపడటంతో వృద్దురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో వృద్దురాలితో మాట్లాడుతూ కనిపించిన దుండగుడు.. ఆమె మెడలోని బంగారు గొలసు లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios