Asianet News TeluguAsianet News Telugu

కరోనా సోకిన ప్రజాప్రతినిధులూ ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే...: కిషన్ రెడ్డి

కరోనా  బారినపడ్డ సామాన్య ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. 

central minister kishan reddy  inspects gandhi hospital
Author
Hyderabad, First Published Jul 12, 2020, 11:11 AM IST

హైదరాబాద్: కరోనా  బారినపడ్డ సామాన్య ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై వుందన్నారు. కరోనా రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటుచేసిన 

గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. హాస్పిటల్ లోని కోవిడ్ రోగుల వార్డును పరిశీలించిన కిషన్ రెడ్డి  రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది వసతులపై వివరాలు సేకరించారు.  

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే  తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని అన్నారు.  అయితే రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నానని... ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నానని అన్నారు. 

read more  కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్ ఓవైసీ (ఫొటోలు)

''ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైద్రాబాద్లోనే ఎక్కుగ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణకు 600వెంటిలేటర్లు పంపించాం. వైద్య సిబ్బందికి, కరోనా బాధితులకు ధైర్యం కల్పించటానికే గాంధీకి వచ్చాను. గాంధీ ఆసుపత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి.  ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' అని అన్నారు. 

''గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఆదేశించాను. గాంధీలో పేషెంట్లకు మానసిన ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత స్థానిక ఎంపీగా నాపై ఉంది. కోవిడ్ కు వ్యాక్సిన్ లేదు.. ప్రజలే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలి?'' అని కిషన్ రెడ్డి సూచించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios