Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటు : రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కేంద్రం లేఖ.. రెండు రోజుల్లో వివరణ ఇవ్వక

మేడిగడడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన ఇచ్చిన 20ప్రశ్నల్లో రెండింటికే సమాధానం చెప్పడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. రెండో రోజుల్లోగా అన్ని ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Centers letter to state government over Collapse of Medigadda Barrage Pillars - bsb
Author
First Published Oct 28, 2023, 9:42 AM IST

ఢిల్లీ : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్రం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రేపటిలోపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపింది. మేడిగడ్డ  వద్ద నిర్మించి న లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటుపై మొత్తం 20 ప్రశ్నలకు వివరణ కోరగా.. రెండు ప్రశ్నలకు మాత్రమే అధికారులు సమాధానం పంపారు. 

దీంతో, రేపటిలోకి అన్ని ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం లేదని భావిస్తాం అని కేంద్రం హెచ్చరించింది. పంపే సమాధానం బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని లేఖలో స్పష్టం చేసింది. 

కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ: పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్

ఇదిలా ఉండగా, ఈ నెల 21న మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ  కుంగిపోయింది. ఈ నెల 24న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  టీమ్  దీన్ని పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ పరిశీలనలో పాల్గొంది. బ్యారేజీకి చెందిన  20, 21 పిల్లర్లను  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్ ఐదు అడుగుల మేర కుంగిపోయింది.  

వీటితో పాటు.. 15 నుండి 20వ నెం. వరకు ఉన్న పిల్లర్లను నిపుణుల బృందం పరిశీలించింది. ప్రధానంగా 19, 20 పిల్లర్ల మధ్య  కుంగుబాటుకు గురైందని నిపుణులు భావిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీరింగ్ సిబ్బందితో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  బృందం చర్చించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios