Asianet News TeluguAsianet News Telugu

కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ: పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్


కుంగిపోయిన  లక్ష్మీబ్యారేజీని  మంగళవారంనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం  పరిశీలించింది. 

 NDSA committee investigate sinking of Medigadda (Laxmi) Barrage pillars lns
Author
First Published Oct 24, 2023, 12:33 PM IST

భూపాలపల్లి:మేడిగడ్డ  వద్ద నిర్మించి న లక్ష్మీ బ్యారేజీని  మంగళవారంనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  టీమ్  పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలోని  ఆరుగురు  సభ్యుల బృందం   పరిశీలించింది.ఈ నెల 21న  మేడిగడ్డ వద్ద నిర్మించిన  లక్ష్మీ బ్యారేజీ  కుంగిపోయింది.  బ్యారేజీకి చెందిన  20, 21 పిల్లర్లను  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం  పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్  ఐదు అడుగుల మేర కుంగిపోయింది.  

15 నుండి  20వ పిల్లర్లను  నిపుణుల బృందం  పరిశీలించింది. ప్రధానంగా  19, 20 పిల్లర్ల మధ్య  కుంగుబాటుకు గురైందని నిపుణులు భావిస్తున్నారు.    నీటి పారుదల శాఖ అధికారులు,  ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీరింగ్ సిబ్బందితో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  బృందం చర్చిస్తున్నారు.

గోదావరి నదికి  20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించిన సమయంలో బ్యారేజీకి ఎలాంటి  ఇబ్బందులు రాని విషయాన్నిఇరిగేషన్ అధికారులు గుర్తు చేస్తున్నారు . 20వ పిల్లర్ వద్ద కుంగిపోవడానికి  గల కారణాలపై  నిపుణుల బృందం  విచారణ చేయనుంది. పిల్లర్ కుంగిపోవడంతో  బ్యారేజీలోని  10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.  

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా మేడిగడ్డ  వద్ద లక్ష్మీ బ్యారేజీని  నిర్మించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ను తానే రూపొందించినట్టుగా కేసీఆర్ చెప్పుకున్నారని విపక్ష పార్టీల నేతలు  ప్రస్తుతం గుర్తు చేశారు. వేల కోట్లు ఖర్చు చేసి  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి పదేళ్లు కూడ కాకముందే  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయమై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి లేఖ రాశారు.  నేషనల్ డ్యామ్  సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపాలని ఆయన లేఖ రాశారు. దీంతో జల్ శక్తి మంత్రిత్వశాఖ  వెంటనే రాష్ట్రానికి బృందాన్ని పంపింది.  నిన్న హైద్రాబాద్ కు చేరుకున్న అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం  ఇవాళ మేడిగడ్డ వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత  ప్రాజెక్టు నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం  చర్చించనుంది.డ్యామ్ భద్రతపై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు  నివేదిక ఇవ్వనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios