ఆర్టీసి బస్సు డ్రైవర్లకు షాకింగ్ న్యూస్

Cell phone \s will not be allowed to RTC Drivers
Highlights

సెల్ ఫోన్ వాడితే వేటు తప్పదు

గోదావరిఖని : రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో ఒకటి ఆర్టీసి డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం. చాలా మంది ఆర్టీసి డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. కొందరైతే సెల్ ఫోన్లో నిమిషాల తరబడి చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. అసలే పెద్ద వాహనం.. పైగా డ్రైవర్ సెల్ ఫోన్లో మొఖం పెట్టి చూస్తూ ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? ఈపెద్ద వాహనం పోయి ఇంకో పెద్ద వాహనాన్ని ఢీకొట్టినా.. లేదంటే చిన్నవాహనానన్ని ఢీకొట్టినా నష్టం తీవ్రంగా ఉంటుంది.

గత మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ ఒకాయన నిమిషాల పాటు సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. దీంతో ప్రయాణీకులు ఆయన డ్రైవింగ్ ను సెల్ పోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో ఆ డ్రైవర్ మీద సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసి బస్సు డ్రైవర్లందరికీ సెల్ ఫోన్లను నిషేధిస్తూ కరీంనగర్ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన మంగళవారం నుంచి (ఈనెల 5) అమలులోకి వస్తుందని ప్రకటించారు.

ఇటీవల కాలంలో తరుచుగా ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవుతున్న విషయాన్ని యాజమాన్యం సీరియస్ గా పరిగణించిందని అందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆర్ఎం తెలిపారు. మొబైల్ ఫోన్లు వినియోగించే డ్రైవర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తొలుత జరిమానా విధిస్తామని అయినా వినకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదరా బాదరాగా డ్రైవింగ్ చేయవద్దని, తొందరపాటు డ్రైవర్లకు పనికిరాదని చెప్పారు. బస్సు కండిషన్ ఎప్పటికప్పుడు డ్రైవర్లే చెక్ చేసుకోవాలని సూచించారు.

loader