తెలుగు అకాడమీ నిధులో గోల్‌మాల్ వ్యవహరంలో ఈడీ అధికారులు త్వరలోనే రంగంలోకి దిగనున్నారు.ఈ విషయమై సీసీఎస్ పోలీసులు ఈడీకి లేఖ రాశారు. మనీ లాండరింగ్ చోటు చేసుకొందనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 


హైదరాబాద్:తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ విషయంలో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగనుంది. ఈ విషయమై సీసీఎస్ పోలీసులు enforcement directorate‌కి లేఖ రాశారు.telugu akademi లో డిపాజిట్ల మళ్లింపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తూ దర్యాప్తు చేయాలని సీసీఎస్ పోలీసులు ఈడీకి లేఖ రాశారు. తెలుగు అకాడమీ నుండి కొల్లగొట్టిన డబ్బులతో నిందితులు స్థిరాస్తులు కొనుగోలు చేశారని ccs పోలీసులు గుర్తించారు. 

also read:telugu academy scam: నిందితుల గాలింపులో సీసీఎస్ పురోగతి.. కొయంబత్తూరులో పద్మనాభన్ అరెస్ట్

మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే 11 మందిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు అకాడమీకి చెందిన నిధులను నిందితులు పక్కా స్కెచ్ వేసి డ్రా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిధుల గోల్‌మాల్ లో బ్యాంకు అధికారులతో పోటు అకాడమీకి చెందిన ఉద్యోగుల పాత్రను కూడ పోలీసులు దర్యాప్తులో తెలుసుకొన్నారు.

 ఇంకా మరికొందరు అనుమానితులకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఆధారాలు లభిస్తే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకొనే అవకాశం కూడా లేకపోలేదు.