Asianet News TeluguAsianet News Telugu

telugu academy scam: నిందితుల గాలింపులో సీసీఎస్ పురోగతి.. కొయంబత్తూరులో పద్మనాభన్ అరెస్ట్

తెలుగు అకాడమీ స్కామ్‌లో కేసులో మరొకరు అరెస్ట్ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూర్‌లో పద్మనాభన్‌ను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కి చేరింది. అనంతరం కొయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు పద్మనాభన్‌ను తరలించారు. 

padmanabhan arrested in coimbatore in telugu academy scam
Author
Coimbatore, First Published Oct 7, 2021, 8:36 PM IST

తెలుగు అకాడమీ స్కామ్‌లో కేసులో మరొకరు అరెస్ట్ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూర్‌లో పద్మనాభన్‌ను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కి చేరింది. అనంతరం కొయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు పద్మనాభన్‌ను తరలించారు. ఈ కుంభకోణంలో అతను నకిలీ ఎఫ్‌డీలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఎఫ్‌డీలనే సాయికుమార్ తెలుగు అకాడమీకి ఇచ్చాడు. 

కాగా, తెలుగు అకాడమీ కుంభకోణం (telugu academy scam) కేసులో సీసీఎస్‌ పోలీసులు (ccs Police) దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితులు కృష్ణారెడ్డి, మదన్, భూపతి, యోహన్‌రాజ్‌ కోసం సీసీఎస్ గాలిస్తోంది. కృష్ణారెడ్డే ఈ కుంభకోణానికి ప్లాన్ గీసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. వెంకట సాయికుమార్‌ అనే వ్యక్తి కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు తేల్చారు.  

సాయికుమార్‌ తొలుత కృష్ణారెడ్డిని సంప్రదించి కుంభకోణానికి తెరదీసినట్లుగా తేలింది. కృష్ణారెడ్డి తొలుత అకాడమీ చెక్కులను సాయికుమార్‌, ఇతర వ్యక్తులకు ఇచ్చినట్లు నిర్ధారించారు. వీరు భూపతి సాయంతో చందానగర్‌, సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌ల్లోని యూబీఐ, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఏడాది కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. అలాగే ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు (deposits) తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. అనంతరం ఒరిజినల్ ఎఫ్‌డీలతో రూ.64.5 కోట్లు డ్రా చేసింది ఈ ముఠా.

Also Read:telugu academy scam: రూ.64 కోట్లలో ఎవరెంత పంచుకున్నారంటే.. సూత్రధారులు వీరే, రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతాను తెరిచారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలను సృష్టించారు. అనంతరం యూనియన్ (union bank), కెనరా బ్యాంకుల్లో (canera bank) కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్‌కు (agrasen bank) ఆ తర్వాత ఏపీ మర్కంటైల్ సొసైటీకి (ap mercantile cooperative bank) మళ్లించారు. ఆపై మర్కంటైల్‌లో రూ.64. కోట్లు డ్రా చేసి కొట్టేసింది ఈ గ్యాంగ్. ఇందుకోసం రూ.6 కోట్లను బ్యాంక్ మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచమిచ్చారు. అలాగే అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కి సైతం రూ.కోట్లలో ముడుపులు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టారు  నిందితులు. 

మొత్తం రూ.64.5 కోట్లను కొట్టేసిన నిందితులు సాయికుమార్‌ రూ.20 కోట్లు, సత్యనారాయణ రూ.10 కోట్లు, వెంకటరమణ రూ.7 కోట్లు, కృష్ణారెడ్డి 6 కోట్లు, రమణారెడ్డి రూ.6కోట్లు, రాజ్‌కుమార్‌ రూ.3కోట్లు, మస్తాన్‌ వలి రూ.2.5 కోట్లు, భూపతి రూ.2.5కోట్లు, కెనరాబ్యాంకు మేనేజర్‌ రూ.2కోట్లు, పద్మనాభన్‌ రూ.50 లక్షలు, యోహన్‌రాజ్‌ రూ.50 లక్షలు మదన్‌ రూ.30లక్షలు తీసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios