Asianet News TeluguAsianet News Telugu

ఇక ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ సర్వీసెస్

టీఎస్ ఆర్టీసీ మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యాష్ లెస్ సర్వీస్ ను అందుబాటులోకి ఉంచింది. ఈ విధానం చాలా మందికి ఉపయోకరంగా ఉండనుంది. 

Cashless services at RTC booking counters
Author
Hyderabad, First Published Dec 23, 2021, 4:06 PM IST

తెలంగాణ ఆర్టీసీ మ‌రో మందడుగు వేసింది. మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మ‌రో కొత్త విధానానికి శ్రీ‌కారం చుట్టింది.  ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ స‌ర్వీసెస్ అందుబాటులో ఉంచింది. ఇది చాలా మంది ప్ర‌యాణికుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది. ఈ కొత్త స‌దుపాయంతో ఆర్టీసీ అధికారులెవ‌రూ కౌంట‌ర్ వ‌ద్ద లేక‌పోయినా.. అడ్వాన్స్ టికెట్‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

doing కరోనా, ఒమిక్రాన్ కట్టడికై రాష్ట్రాలకే కేంద్రం సూచనలు

ఎలా ప‌ని చేస్తుందంటే ? 
ఇప్ప‌టి వ‌ర‌కు బ‌స్ పాసులు రెన్యువ‌ల్ చేయాలంటే దానికి ఓ పెద్ద ప్ర‌యాస ప‌డాల్సి వ‌చ్చేది. ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ఈ క‌ష్టాలు తీర‌నున్నాయి. ఇది ఎక్కువ‌గా దూర ప్రాంతాలు ప్ర‌యాణించే ప్ర‌యాణికులకు చాలా సౌక‌ర్యంగా ఉండ‌నుంది. దూర ప్రాంత నుంచి ప్ర‌తీ రోజు సిటీలోకి వ‌చ్చే వ్య‌క్తులు తిరిగి ఇంటికి వెళ్లే స‌మ‌యంలో పాస్‌ల‌ను రెన్యువ‌ల్ చేసుకోవాల‌ని భావిస్తారు. అయితే వారు ఇంటికి వెళ్లే స‌మ‌యంలో ఆర్టీసీలో బస్ పాస్ కౌంట‌ర్లు మూసి ఉంటున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సార్లు పాస్ ఉన్న‌ప్ప‌టికీ వాటిని స‌మ‌యానికి రెన్యువ‌ల్ చేసుకోలేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌త్యేకంగా టికెట్ కొనుగోలు చేసి ప్ర‌యాణించాల్సి వ‌స్తోంది. ఇలాంటి క‌ష్టాల‌కే చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ స‌దుపాయం వ‌ల్ల మీరు ఎలాంటి వ‌స్తువును కూడా ముట్టుకోన‌వ‌స‌రం లేదు. క‌రోనా విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ స‌దుపాయం మ‌రింత ఉప‌యోగ‌క‌రంగా మారింది. ఈ కౌంట‌ర్లు ఉద‌యం ఆరున్నర నుంచి రాత్రి 8.15 నిమిసాల వ‌ర‌కు అందుబాటులోకి ఉంటాయి. ప్ర‌యాణికుల వ‌ద్ద ఉన్న యూపీఐ పేమెంట్స్ ద్వారా, లేదా వ్యాలెట్ల ద్వారా కౌంట‌ర్ సెంట‌ర్ల‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయ‌డం ద్వారా పాస్ ను రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం అయితే ఈ స‌దుపాయం రైతిఫ‌ల్‌, జూబ్లీబ‌స్టాండ్‌, సీబీఎస్‌, కేపీహెచ్‌బీ వంటి బస్టాండ్‌ల‌లో అందుబాటులో ఉంది. త‌రువాత హైద‌రాబాద్‌లోని అన్ని బ‌స్ స్టాండ్ల‌లో వీటిని అందుబాట‌లోకి తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఆర్టీసీ ఉంది. ఇదే జ‌రిగితే మ‌రింత మంది ప్ర‌యాణికుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది.

హైదరాబాద్ శివార్లలో దారుణం.. బొంగలూరు వద్ద తల లేని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

క‌నిపిస్తున్నస‌జ్జ‌నార్ మార్క్‌..
ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ స‌జ్జ‌నార్ బాధ్య‌తలు స్వీక‌రించిన నాటి నుంచి ఆ సంస్థ‌లో మార్పులు మొద‌ల‌య్యాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎండీ స‌జ్జ‌నార్... ఆ వేధిక ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. ప్ర‌తీ సారి ద‌స‌రా స‌మ‌యంలో ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల పేరుతో ఛార్జీలు పెంచుతూ వ‌స్తోంది. అయితే ఈ సారి మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. అలాగే రూల్స్ పాటించ‌ని అధికారుల విష‌యంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు స‌జ్జ‌నార్‌.  ఇటీవ‌ల ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన ఇద్ద‌రికీ జీవితాంతం బ‌స్ ఫ్రీగా ఇచ్చారు. బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలోని ఎంఆర్‌పీ కంటే ఎక్కువ‌గా వ‌స్తువుల‌ను అమ్ముతున్న స్టాల్స్‌పై రూ.ల‌క్ష ఫైన్ విధించారు. అలాగే హైద‌రాబాద్ ప‌రిధిలో ఫొన్ చేస్తే ఇంటికే బ‌స్ పాస్ తీసుకొచ్చే విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ, కొత్త కొత్త విధానాలను ప్ర‌వేశ‌పెడుతూ త‌న‌దైన మార్క్ చూపిస్తున్నారు స‌జ్జ‌నార్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios