హైదరాబాద్ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండలం బొంగలూరు వద్ద తలలేని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

హైదరాబాద్ (hyderabad) శివార్లలో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండలం బొంగలూరు వద్ద ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్ పక్కన తలలేని మృతదేహాన్ని (headless body) పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈరోజు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని నల్గొడ జిల్లా వద్దిపట్ల‌కు చెందిన నామా శ్రీనివాస్‌ (42)గా గుర్తించారు. అయితే నామా శ్రీనివాస్ 40 రోజులుగా కనిపించకుండా పోయాడు. 

అయితే నామా శ్రీనివాస్‌ను హత్య చేసిన బ్రహ్మచారి అనే వ్యక్తి తాజాగా స‌రూర్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో (saroornagar police station) లొంగిపోయాడు. అతడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు.. బొంగలూరు వద్ద నామా శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించారు. ఇక, శ్రీనివాస్‌ను హత్య చేసిన బ్రహ్మచారి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టాడు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. ఘటన స్థలంలో గడ్డపార, రెండు గంపలు, తీగలు స్వాధీనం చేసుకన్నారు.