హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు  ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌‌సన్‌కు డబ్బుల్లిస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు.

Also read:కేటీఆర్‌దంటూ ఆరోపణ: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు డెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న విషయం తెలిసిందే. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే  ఈ కేసులో తననను ఇరికించారని  రేవంత్ రెడ్డి అప్పట్లో  ప్రకటించారు. ఈ కేసులో రేవంత్ ఏ-1 గా ఉన్నాడు.

ఈ కేసు విచారణను పురస్కరించుకొని రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌లోని  ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి  టీడీపీలో ఉన్నాడు. టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన వేం నరేందర్ రెడ్డికి ఓటు కోసం డబ్బులు పంచుతూ రేవంత్ రెడ్డి దొరికాడని  ఏసీబీ ప్రకటించింది. 

రేవంత్ రెడ్డిని 2015లో ఓటు నోటు కేసులో ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్సీకి లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, అందులో అడ్వాన్స్ గా రూ. 50 లక్షల రూపాయలను అందజేస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. 

ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పేరును పలుమార్లు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిందితులను విచారించింది కూడా. ఏసీబీ మాత్రమే కాకుండా ఈడీ విచారణ జరిపింది.