రేవంత్‌పై మరో కేసు నమోదు, ఐదుగురి అరెస్ట్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ విధించడంతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్‌గా గుర్తించారు. 

case filed against congress mp revanth reddy in narsingi police station

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ విధించడంతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిని ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్‌గా గుర్తించారు. అయితే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరేశ్‌లపై విచారణ కొనసాగుతోంది. 4 సెక్షన్ల కింద రేవంత్ రెడ్డి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారు.

Also Read:రేవంత్ రెడ్డి జిమ్మిక్కు: భూదందా ఆరోపణలపై చెప్తానని, మధ్యలో అదృశ్యమై...

ఎంపీ రేవంత్ రెడ్డికి గోపన్ ‌పల్లి భూముల ఉచ్చును బిగిస్తోంది సర్కార్.  గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో  రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిలపై  అక్రమంగా ఈ భూముల్లో కబ్జాల్లో ఉన్నారని ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

హైద్రాబాద్ గోపన్‌పల్లిలోని 127 సర్వే నెంబర్‌లో ఉన్న 5.5 ఎకరాలకు టైటిల్ లేదని రెవిన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాలు కూడ అక్రమమేనని ఆర్డీఓ తన నివేదికలో తేల్చింది.

అక్రమంగా ఈ భూమిని తన పేరున మార్పిడి చేసుకొన్నారని రేవంత్ రెడ్డి సోదరులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.ఇలా ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా తమ పేరున మ్యుటేషన్ చేసుకొన్నారని ఆర్డీఓ నివేదిక తేల్చింది. 

ఓల్టా చట్టాన్ని రేవంత్ రెడ్డి సోదరులు ఉల్లంఘించారని రెవిన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓల్టా చట్టాన్ని అతిక్రమించినందుకు గాను  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

Also Read:రేవంత్‌కు షాక్: గోపన్‌పల్లి భూముల్లో అక్రమాలు నిజమే, ప్రభుత్వానికి ఆర్డీఓ నివేదిక

హైద్రాబాద్ గోపనపల్లి సర్వే నెంబర్ 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో విక్రయాలు జరిగాయని  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కొందరు కోర్టును కూడ ఆశ్రయించారు. ఈ విషయమై ప్రభుత్వం విచారించింది. 

తప్పుడు డాక్యుమెంట్ల్ ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు తప్పుడుగా రికార్డుల్లో నమోదు చేసేనందుకు గతంలో శేరిలింగంపల్లి తహసిల్దార్ గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు.  దీంతో శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios