ఓ కార్పెంటర్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సత్యనారాయణ వ్రత పీఠాన్ని ఓ చెక్క పెట్టె రూపంలో తయారు చేశాడు. దానిని విడి చేసి తిరిగి వ్రత పీఠంలా మార్చారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ చూసి, ఎంతో మెచ్చుకున్నారు.

ఓ కార్పెంటర్ సత్యనారాయణ వ్రత పీఠాన్ని సరికొత్తగా తయారు చేశారు. దానిని సూట్ కేసు మాదిరిగా మడత పెట్టి తీసుకురావచ్చు. అనంతరం దానిని విడి చేసి, పీఠంలా మార్చుకోవచ్చు. దీనిని చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. ఆ కార్పెంటర్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. 

చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే.. అందులో చచ్చిన ఎలుక వచ్చింది.. తింటుండగా గమనించడంతో..

రాగుల సంపత్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. దానిని మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. అందులో ఓ కార్పెంటర్ ఓ సూట్ కేసు రూపంలో ఉన్న ఓ చెక్కె పెట్టెను తీసుకొని వచ్చారు. దానిని ఓపెన్ చేసి, అందులోని విడి భాగాలను బయటకు తీశారు. అనంతరం వాటిని మెళ్లగా పేర్చారు. చివరికి అది ఒక సత్యనారాయణ వ్రత పీఠంలా మారింది. 

Scroll to load tweet…

ఈ వీడియోను షేర్ చేసిన సంపత్.. ఇంత నైపుణ్యం ప్రదర్శించిన ఆ కార్పెంటర్ కు సాయం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఆ విజ్ఞప్తి కి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ కార్పెంటర్ కు ఎలా సాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.