Asianet News TeluguAsianet News Telugu

Telugu Akademi FD Scam : నిధుల గోల్ మాల్ కేసులో కీలక మలుపు.. డబ్బు తిరిగి చెల్లించేందుకు అంగీకరించిన కెనరా బ్య

అకాడమీకి సంబంధించిన పది కోట్ల రూపాయలను చందా నగర్ లోని కెనరా బ్యాంకులో ఏడాది కాలవ్యవధికి అధికారులు డిపాజిట్ చేశారు. అయితే,  బ్యాంకు మేనేజర్ సాధనతో చేతులు కలిపి, నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకులో ఉన్న డిపాజిట్ ను ఇతర బ్యాంకు మళ్లించారు నిందితులు.  ఆ తర్వాత డబ్బును విడతలవారీగా విత్ డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ ను ఇతర ఖాతాల్లోకి మళ్లించిన తతంగాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమి అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

Canara Bank agrees to repay the money in telugu akademi fd scam case
Author
Hyderabad, First Published Dec 16, 2021, 1:20 PM IST

హైదరాబాద్ : telugu akademi  నిధుల గోల్మాల్ కేసులో పురోగతి కనిపించింది. 
Canara Bankలో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. పది కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడానికి కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించారు. రెండు రోజుల్లోపు 10 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ ఖాతాలో Deposit చేసి ఛాన్సుంది.

అకాడమీకి సంబంధించిన పది కోట్ల రూపాయలను చందా నగర్ లోని కెనరా బ్యాంకులో ఏడాది కాలవ్యవధికి అధికారులు డిపాజిట్ చేశారు. అయితే,  బ్యాంకు మేనేజర్ సాధనతో చేతులు కలిపి, నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకులో ఉన్న డిపాజిట్ ను ఇతర బ్యాంకు మళ్లించారు నిందితులు.  ఆ తర్వాత డబ్బును విడతలవారీగా విత్ డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ ను ఇతర ఖాతాల్లోకి మళ్లించిన తతంగాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమి అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

బ్యాంకు ఉన్నతాధికారులు అడిగిన పత్రాలను Telugu Academy officialsసమర్పించారు. యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతోనూ తెలుగు అకాడమీ అధికారులు సమావేశమై, మొత్తం పరిస్థితిని వివరించారు.  Union Bank లో 40 కోట్లు, సంతోష్ నగర్ శాఖలో 13 కోట్ల రూపాయలను నిందితులు Duplicate documents సమర్పించి చీఫ్ మేనేజర్  మస్తాన్ వలీ సహకారంతో  జేబులో వేసుకున్నారు. ఈ విషయాన్ని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల వద్ద తెలుగు అకాడమీ ఆఫీసర్లు ప్రస్తావించారు. ఈ డిపాజిట్ల విషయంలో ఇక ఫైనల్ డెసిషన్ యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులదే. అయితే, అకాడమీకి సంబంధించిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేలా వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

తెలుగు అకాడమీ స్కాం: దర్యాప్తు బాధ్యతలు సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ.. కారణమిదే

ఇదిలా ఉండగా, Telugu Academy ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం, నిధుల గల్లంతు వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు డిసెంబర్ 3న మరో నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమె ఏపీకి చెందిన మహిళగా సమాచారం. ఈ కేసులో అకాడమీకి చెందిన రూ.64.50 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. 

పక్కా పథకంతో Academy fundingను కొల్లగొట్టిన ప్రధాన సూత్రధారులు చుండూరి వెంకట కోటి సాయి కుమార్, నండూరి వెంకట రమణలు గతంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన Bank depositsను కొల్లగొట్టిన కేసుల్లోనూ నిందితులు.  ఈ నేపథ్యంలో పాత కేసుల్లో వీరికి సహకరించిన వారిని కూడా సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

దీంతో మరి కొందరి ప్రమేయం వెలుగులోకి వస్తోంది. అకాడమీ కేసులో నిందితుడిగా ఉన్న యోహన్ రాజు  భార్యను తాజాగా Vijayawadaలో అరెస్టు చేసినట్లు తెలిసింది. దీంతో అరెస్టయిన నిందితుల సంఖ్య 18కి చేరుకుంది. నిధుల రికవరీ దశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల పెట్టుబడులు, స్థిర, చరాస్తులను ఫ్రీజ్, అటాచ్ చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. ప్రధాన సూత్రధారి  సాయి కుమార్, సహ నిందితుడు వెంకటరమణ విశాఖ శివార్లలోని  వివాన్ ప్రాజెక్టులో ఫ్లాట్ లను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. 

ఆయా ప్లాట్ల వివరాలు ఇవ్వాలంటూ Vivan Project అధినేతను దర్యాప్తు అధికారులు కోరగా, వారికి ఆ వివరాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, తెలుగు అకాడమీ అధికారులు నిందితులుగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ సీసీఎస్ పోలీసులు ఇటీవల ఏసిఈ కోర్టును ఆశ్రయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios