తెలుగు అకాడమీ స్కాం: దర్యాప్తు బాధ్యతలు సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ.. కారణమిదే

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కేసును  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ చేసింది. బ్యాంక్ అధికారుల సిబ్బంది పాత్ర ఉన్నందున ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. 
 

telugu akademi scam case handed over to telangana acb

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కేసును  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ చేసింది. బ్యాంక్ అధికారుల సిబ్బంది పాత్ర ఉన్నందున ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. 

కాగా.. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi scamకి చెందిన రూ.65.05 కోట్ల FDలను కొల్లగొట్టిన సాయికుమార్ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. 

ALso Read:తెలుగు అకాడమీ స్కాం : పట్టుబడ్డ పదహారో నిందితుడు..

పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్ లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు. సాయికుమార్, డాక్టర్ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు. Telugu Academy Fixed Depositsను సొంతానికి వినియోగించుకుంటన్న సమయంలోనే.. సాయికుమార్ ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ, ఆయిల్ సీడ్స్ సంస్థలపై కన్నేశాడు. ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు. బ్యాంక్ అధికారులతో మాట్లాడుకుని అంతా సిద్ధం చేసుకున్నాక కృష్ణారెడ్డిని పలుమార్లు విజయవాడకు పంపించాడు. అక్కడ బ్యాంక్ ఖాతాలను తెరిపించడం, బ్యాంక్ అధికారులతో మాట్లాడ్డం.. ఫిక్స్ డ్ డిపాజిట్లను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక కృష్ణారెడ్డి ఎవరి మాటలు వారికి పంపించడంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. 

అంతకుముందు మరో సూత్రధారిని పోలీసులు అక్టోబర్ 14న అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు అనే వ్యక్తిని గుంటూరులో పట్టుకున్నారు. బ్యాంక్ మేనేజర్లకు సాయికుమార్‌ను పరిచయం చేసింది ఈ సాంబశివరావేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. మేనేజర్లను పరిచయం చేసినందుకు గాను కమీషన్ వసూలు చేశాడు. ఈ క్రమంలోనే మస్తాన్‌వలీ, సాధనను పరిచయం చేసినందుకు గాను రూ.60 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే సాయికుమార్, బ్యాంక్ మేనేజర్లు వైజాగ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్నారు. తాజాగా సాంబశివరావును గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు సీసీఎస్ పోలీసులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios