హైదరాబాద్ గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించి రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా మునిమోక్షం గ్రామానికి చెందిన రోహిత్ రెడ్డి హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే రోహిత్ రెడ్డిని అర్దరాత్రి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి ఆచూకీ గుర్తించాలని అతని కుటుంబ సభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. 

రోహిత్ రెడ్డి కిడ్నాప్‌ కావడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. రోహిత్ ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు సాయం చేయాలని కోరుతున్నారు.