జగిత్యాల జిల్లా రాజారంలో ఇద్దరు యువకులపై మరో ఇద్దరు యువకులు అత్యంత కిరాతకంగా దాడిచేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు హాస్పిటల్ పాలయ్యారు. 

జగిత్యాల :ఇద్దరు యువకులపై కర్రలు, ఇనుప రాడ్లతో అత్యంత పాశవికంగా దాడిచేసారు మరో ఇద్దరు యువకులు. దీంతో తీవ్ర గాయాలపాలై ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన యువకుల మధ్య నిన్న(ఆదివారం) గొడవ జరిగింది. అర్ధరాత్రి గుర్రం ప్రవీణ్, వెంకటేశ్ పై అదే గ్రామానికి చెందిన శివరాత్రి నరేష్, భాగ్యరాజ్ కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేసారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా వెంకటేశ్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.

Read More నల్గొండ : వేట కొడవళ్లతో యువకుడిని నరికి చంపిన దుండగులు.. పరువు హత్యగా అనుమానం

గ్రామస్తుల సమాచారంతో రాజారం గ్రామానికి చేరుకున్న మల్యాల పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన కారణలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.