పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, కానీ వాటిని ప్రజలకు చెప్పుకోలేకపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. తాము పనుల కంటే ప్రచారం పై ఫోకస్ పెట్టి ఉంటే తప్పకుండా గెలిచేవాళ్లమని అన్నారు.

BRS would have won if it had focused on propaganda rather than work - Former minister KTR..ISR

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోలేదని, అందుకే ఇష్టారీతిన హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి, 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. అయితే తప్పుడు ప్రచారం నమ్మి, గొప్ప పనులు చరేసిన నాయకులను ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పారు. 

దావత్ ఎంత పని చేసింది.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి..

దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కానీ ఏనాడు ఈ విషయాన్ని చెప్పుకోలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో అందరికన్నా ఎక్కువగా 73  జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, కానీ దీనిని తాము ప్రచారం చేసుకోలేదని అన్నారు. 29 లక్షలు ఉన్న పెన్షన్ లను 46 లక్షలకు పెంచామని, కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు.

Praja Palana: ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు.. ఫోన్‌కు కాల్, మెస్సేజీ వచ్చిందా? జాగ్రత్త!

అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉండేదని అన్నారు. తాము వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని అన్నారు. ప్రజల సౌకర్యమే చూశామని, కానీ ఏనాడు రాజకీయ ప్రచారం గురించి ఆలోచించలేదని అన్నారు. 

2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ - నిర్మలా సీతారామన్

అయితే ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలని కేటీఆర్ నాయకులకు సూచించారు. తమ పార్టీకి మూడో వంతు సీట్లు వచ్చాయని, 14 స్థానాల్లో కేవలం 6 వేల ఓట్ల తోనే ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు 1.85 శాతమే ఓట్ల తేడా ఉందని అన్నారు. స్దానిక సంస్ధల నుంచి, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం బీఆర్ఎస్ కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నింటి కంటే మించి కేసీఆర్ అలాంటి గొప్ప నాయకుడు బీఆర్ఎస్ కు ఉన్నారని తెలిపారు.

Ashok Gajapathi Raju : రైల్వే ప్లాట్ ఫారంపై రాజకుటుంబం ... ఎంత సింప్లిసిటీ సామీ..!

రైతుల రుణాలు మాఫీ చేస్తామని, వెంటనే వెళ్లి లోన్ తెచ్చుకోవాలని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ తెలిపారు. కానీ ఇంత వరకు దానిని అమలు చేయలేదని అన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారి లేక, అప్పులు, శ్వేత పత్రాలు అంటూ నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించామని అన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పొడు భూములకు పట్టాల పంపిణీ వంటివి ఎన్నో చేశామని, అయినా కొన్ని చోట్ల గిరిజనులు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వలేదని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios