ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి: పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పార్టీ పాలసీలను త్వరలోనే రూపొందించనున్నట్టుగా ఆయన చెప్పారు.
హైదరాబాద్: రానున్నది రైతు ప్రభుత్వమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మారుస్తూ ఈసీ పంపిన పత్రాలపై శుక్రవారంనాడు మధ్యాహ్నం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండానేనని కేసీఆర్ చెప్పారు.కర్ణాటకకు కుమారస్వామి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.
also read:టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: తెలంగాణ భవన్‌లో వేడుకలు, పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ
త్వరలోనే పార్టీ పాలసీలను రూపొందిస్తామని కేసీఆర్ చెప్పారు. కర్ణాటకలో జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. రైతు పాలసీ, జలవిధానాన్ని రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ ఇదే బీఆర్ఎస్ నినాదమని కేసీఆర్ వివరించారు.తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అన్ని ప్రతికూల పరిస్థితులను అదిగమించి తెలంగాణను సాధించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తెలుగువాళ్లున్నారన్నారు. వారి కోసం బీఆర్ఎస్ పనిచేయనుందని కేసీఆర్ చెప్పారు.