Dlehi Liquor Sam: విచారణకు హాజరు కాలేనని కవిత లేఖ , ఈడీ నిర్ణయంపై ఉత్కంఠ

బీఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి  సోమా భరత్ ద్వారా  విచారణకు రాలేనని కవిత  ఈడీకి లేఖ పంపారు. 

BRS MLC  Kalvakunttla Kavitha  Sents Letter To  Enforcement  Directorate

న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు  తీర్పు వచ్చే వరకు  తాను  ఈడీ విచారణకు  హాజరు కాలేనిని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈడీకి  గురువారంనాడు లేఖ పంపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు  విచారణ  సరికాదని  ఆ లేఖలో ఆమె అభిప్రాయపడ్డారు.  మీరు అడిగిన  బ్యాంకు స్టేట్ మెంట్ సహా ఇతర డాక్యుమెంట్లను తన ప్రతినిధితో  పంపినట్టుగా  ఈడీ అధికారులకు రాసిన లేఖలో ఆమె  పేర్కొన్నారు.  

ఇవాళ  ఉదయం 11 గంటలకు  కవిత  ఈడీ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు . న్యాయ నిపుణులతో  చర్చలు  తర్వాత   కవిత కీలక  నిర్ణయం తీసుకున్నారు.బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ద్వారా  ఈడీ కార్యాలయానికి  లేఖ ను ఇతర డాక్యుమెంట్లను పంపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పంపిన  లేఖను ఈడీ కార్యాలయంలో భరత్   అందించారు. 

ఈ నెల  15వ తేదీన  సుప్రీంకోర్టులో  కవిత పిటిషన్ దాఖలు  చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తన విచారణపై స్టే  ఇవ్వాలని కోరారు. అంతేకాదు మహిళలను ఇంటి వద్ద కాకుండా  ఈడీ  కార్యాలయాల్లో విచారించే  విషయమై  ఆదేశాలివ్వాలని  ఆ పిటిషన్ లో  కోరారు. ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు ఈ నెల  24వ తేదీన విచారణ నిర్వహించనుంది. 

ఈ నెల 11వ తేదీన కవిత  ఈడీ విచారణకుహాజరయ్యారు. ఇవాళ  గోరంట్ల బుచ్చిబాబు,  అరుణ్ రామచంద్రపిళ్లైతో  కలిపి  కవితను  విచారించే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.ఇవాళ  ఉదయం  11 గంటలకు   ఈడీ విచారణకు  కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ  విచారణకు హాజరు కాకుండా  కవిత చివరి  నిమిషంలో భరత్ ద్వారా  సమాచారం  పంపారు. 

ఈ విషయమై  ఈడీ అధికారులతో  సోమా భరత్ సంప్రదింపులు  జరుపుతున్నారు. కవిత వినతిపై  ఈడీ అధికారులు  ఎలా స్పందిస్తారనేది  ఇంకా  స్పష్టత రాలేదు .  ఈ విషయమై ఈడీ అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది  ఉత్కంఠ  నెలకొంది. 

also read:Delhi Liquor Scam: న్యాయ నిపుణులతో కవిత చర్చలు ,ఈడీకి సమాచారం పంపిన ఎమ్మెల్సీ

ఈ నెల 8వ తేదీన  కవితకు ఈడీ  అధికారులు నోటీసులు  ఇచ్చారు.ఈ నెల  9వ తేదీన  విచారణకు  రావాలని ఆదేశించారు.  కానీ  ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల  9వ తేదీన విచారణకు  రాలేనని   ఈడీ  అధికారులకు  కవిత  లేఖ  రాశారు.  కవిత  వినతి మేరకు ఈ  నెల 11వ తేదీన  కవిత విచారణకు హాజరయ్యారు.  ఇవాళ విచారణకు  రావాలని  కోరారు. కానీ  చివరి నిమిషంలో  కవిత  విచారణకు హాజరు కాలేనని  సోమా భరత్ ద్వారా సమాచారం పంపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios