Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదేళ్లలో మోడీ ఒక్క ప్రెస్‌మీటైనా పెట్టారా : జర్నలిస్టుల సమావేశంలో కల్వకుంట్ల కవిత

గడిచిన తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ వందలాది మంది జర్నలిస్టులతో ప్రెస్‌మీట్ నిర్వహించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని కవిత అన్నారు. 

BRS MLC Kalvakuntla kavitha fires on pm narendra modi
Author
First Published Jan 8, 2023, 6:14 PM IST

ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . ఆదివారం పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పదవ ప్లీనరీలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ ఒక్కసారి మీడియా మీట్ నిర్వహించలేదన్నారు. దీనిపై ఒక్క జర్నలిస్ట్ యూనియన్ కూడా ప్రశ్నించలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ వందలాది మంది జర్నలిస్టులతో ప్రెస్‌మీట్ నిర్వహించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని కవిత అన్నారు. 

కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఇలాంటి కుట్రల పట్ల జర్నలిస్టులు సైతం ఆలోచించాలని కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే కేంద్రం కూడా నిధులు కేటాయించేలా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కవిత కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు. 

ALso REad: తెలంగాణకు నిధులివ్వరు.. ఇక్కడ పోటీ చేస్తారా, మోడీని ఓడించి తీరుతాం : మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు

అంతకుముందు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ప్రధాని మోడీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారని,రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు.తెలంగాణలో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని.. కరోనా సమయంలో కూడా రైతు బంధును ఆపలేదని మంత్రి చెప్పారు. దేశంలో నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు కార్యక్రమం కింద నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతోందని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios