బీఆర్ఎస్ తెలంగాణ‌ను అప్పుల ఊబిలోకి నెట్టింది: కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి

Hyderabad: తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధ్య‌క్షులు, కేంద్రం ప‌ర్యాట‌క శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మ‌రోసారి భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ తెలంగాణ‌ను అప్పుల ఊబిలోకి నెట్టింద‌ని పేర్కొన్నారు. 
 

BRS has pushed Telangana into a debt trap: Union Minister G Kishan Reddy  RMA

Union tourism minister G Kishan Reddy: తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధ్య‌క్షులు, కేంద్రం ప‌ర్యాట‌క శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మ‌రోసారి భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ తెలంగాణ‌ను అప్పుల ఊబిలోకి నెట్టింద‌ని పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర చీఫ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయ‌న మాట్లాడుతూ.. మద్యం విక్రయాలతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజలు ఆందోళన చెందుతున్నార‌ని అన్నారు. ప్రభుత్వం భూముల‌ను యథేచ్ఛగా విక్రయిస్తోందని మంత్రి ఆరోపించారు. ధరణి వెబ్ పోర్టల్ పేరుతో భూ యజమానులను, రైతులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణిచివేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం లంచాలు తీసుకుంటే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పనిలో, ప్రాజెక్టులో కమీషన్లు తీసుకుంటోంది. పార్టీలు ఒకే నాణానికి రెండు ముఖాలు' అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని, ఇద్దరిలో ఎవరికైనా ఓటేస్తే ఏఐఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios