Asianet News TeluguAsianet News Telugu

12న తెలంగాణలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాలు మందగించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడే అవకాశం ఉంది. ఈ నెల 12న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. 

breaking monsoon to hit Telangana on june 12

 

రేపటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల సూచన. క్యుములోనింబస్ ఏర్పడి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం మామూలు కంటే ఎండలు మండుతాయని కూడా వారు హెచ్చరించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాలు మందగించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడే అవకాశం ఉంది. ఈ నెల 12 దాకా  నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించవని, అంతవరకు వానలో కోసం ఆగక తప్పదు.  

Follow Us:
Download App:
  • android
  • ios