కేసీఆర్ కనుసన్నల్లో బండి సంజయ్ అరెస్ట్: తరుణ్ చుగ్

బండి సంజయ్  కుటుంబ సభ్యులను  బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ  తరుణ్ చుగ్  ఇవాళ పరమార్శించారు.  బండి సంజయ్ ను తప్పుడు కేసులో  అరెస్ట్  చేశారని  తరుణ్ చుగ్  విమర్శించారు. 
 

BJP  Telangana Incharge Tarun Chugh Slams  KCR  lns


కరీంనగర్: ఎలాంటి  వారంట్ లేకుండా  అక్రమంగా బండి సంజయ్  ను అరెస్ట్  చేశారని  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ  తరుణ్ చుగ్  విమర్శించారు. శుక్రవారంనాడు  కరీంనగర్ లో  బండి సంజయ్ కుటుంబ సభ్యులను  తరుణ్ చుగ్ పరామర్శించారు.  బండి సంజయ్  అత్త వనజ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.  బండి సంజయ్  కుటుంబ సభ్యులను  పరామర్శించిన తర్వాత కరీంనగర్ లో    ఆయన  మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ కనుసన్నల్లోనే బండి సంజయ్ ను నిర్భంధించారన్నారు. ఏ కేసు అని చెప్పకుండా  బండి సంజయ్ ను  నిర్భంధించారని  ఆయన  ఆరోపించారు. బండి సంజయ్ ఫోన్ ను  పోలీసులు దొంగిలించారన్నారు.  కేసీఆర్ పోలీసులు మొబైల్  దొంగలుగా మారారని  ఆయన విమర్శించారు. . అధికారులు  హక్కుల్ని  కాపాడాల్సింది  పోయి  కేసీఆర్ కోసం  పనిచేస్తున్నారన్నారు. 

తెలంగాణ మంత్రి వర్గం  ఆలీబాబా  40 దొంగలుగా తయారైందని  ఆయన ఎద్దేవా  చేశారు.టీఎస్‌పీఎస్ సీ  పేపర్ లీక్  కేసులో  కేటీఆర్  హస్తం ఉందని ఆయన  ఆరోపించారు.  30 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో  కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని  ఆయన  విమర్శించారు. తెలంగాణలో  లిక్కర్ మాఫియా, లీకుల  రాజ్యం  నడుస్తుందన్నారు.

also read:బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్: అండగా ఉంటామని హామీ

టెన్త్ క్లాస్ హిందీ పేపర్  లీక్  కుట్రకేసులో పోలీసులు  బండి సంజయ్ ను  అరెస్ట్  చేశారు. హన్మకొండ  కోర్టు  బెయిల్ మంజూరు చేయడంతో  కరీంనగర్ జైలు నుండి  బండి  సంజయ్  ఇవాళ విడుదలయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios