TS: విద్యార్థుల‌ ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త .. కేసీఆర్‌పై బండి సంజ‌య్ ఫైర్

Telangana: తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల ఫలితాలు ఇటీవ‌లే విడుద‌ల అయ్యాయి. అయితే, ప‌లువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామ‌నే కార‌ణంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. దీంతో ఇంట‌ర్ ఫ‌లితాలు వివాదాల‌కు దారి తీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

bjp state president fires on kcr government

Telangana: తెలంగాణ‌లో ఇంటర్ ఫ‌లితాలు ఇటీవ‌లే విడుద‌ల అయ్యాయ‌. అయితే, ఫెయిల్ అయ్యామ‌నే మ‌న‌స్థాపంతో ప‌లువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవ‌డంతో ఇంట‌ర్  ప‌రీక్ష‌ ఫలితాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే ఫెయిల్ అయ్యామన్న మనోవేదనకు గురై  ముగ్గురు విద్యార్థులు త‌మ ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఇంట‌ర్ బోర్డుతో పాటు ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో  విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంతోనే  విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు.  విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే త‌న గుండె తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యార్థులు త‌మ ప్రాణాలు తీసుకోవ‌ద్ద‌ని కోరారు.

Also Read:  up assembly elections 2022: ఎన్నిక‌ల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయం: అఖిలేష్ యాద‌వ్

అలాగే, విద్యార్థులు ప్రాణాలు తీసుకొవ‌ద్ద‌ని సూచించారు.  మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు తమ నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్ద‌న్నారు.  శ‌నివారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నార‌ని బండి సంజ‌య్ అన్నారు. విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్య‌లో పాఠ‌శాల‌లు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. విద్యార్థులంతా ఆన్ లైన్ ద్వారానే  త‌ర‌గ‌తుల‌కు హాజరయ్యారు. అయితే, తెలంగాణ స‌ర్కారు  ఈ ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో విఫలమైందని  బండి సంజ‌య్ ఆరోపించారు. తాజా ఇంట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో అధికంగా గ్రామీణ విద్యార్థులు ఉండ‌గా, అందులో పేద‌లే అధికంగా ఉన్నార‌ని అన్నారు.

Also Read:  బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల‌కు ఆస్కారం లేదు.. AFSPAపై NHRC ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు 

విద్యార్థుల ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం, ఇంట‌ర్ బోర్డు స‌రైనా ఏర్పాటు చేయ‌లేద‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు కేసీఆర్ స‌ర్కారే బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గతంలో కూడా మంత్రి కేటీఆర్ బినామీ నిర్వాకంతో 27 మంది బలైయ్యారని మండిపడ్డారు. మ‌ళ్లీ ఇప్పుడు కూడా విద్యార్థుల జీవితాల‌తో ప్ర‌భుత్వం అడుకుంటున్న‌ద‌ని ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు, ఫెయిలయిన విద్యార్థులకు న్యాయం చేయాలని  డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం స్పంద‌న స‌రైన విధంగాలేక‌పోతే  రాష్ట్రం వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అలాగే,  ఫెయిలయిన విద్యార్ధులకు ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయించాల‌న్నారు. ఫలితాల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు.. ఇంటర్ బోర్డు (Board of Intermediate Education) ఎదుట ఆందోళన చేపడుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.

Also Read:  Cold Wave: చలి చంపేస్తోంది బాబోయ్.. మైన‌స్ డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌త‌లు.. అధికారుల హెచ్చరిక‌లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios