Asianet News TeluguAsianet News Telugu

బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల‌కు ఆస్కారం లేదు.. AFSPAపై NHRC ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు

NHRC: ఈశాన్య భారతంలో సైనికుల‌కు ప్ర‌త్యేక అధికార‌లు క‌ల్పించిన "సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం" (Armed Forces Special Powers Act-AFSPA) ర‌ద్దు చేయాల‌ని కోరుతూ చాలా ఏండ్లుగా అక్క‌డి ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో సైనిక బ‌ల‌గాలు కాల్పుల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవ‌డంతో  AFSPA అంశం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్చార్సీ) ఛైర్మన్  జ‌స్టిస్ ఆరుణ్ మిశ్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 

NHRC chairperson casts suspicion over human rights violations due to AFSPA
Author
Hyderabad, First Published Dec 18, 2021, 1:49 PM IST

NHRC: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ తో పాటు ఈశాన్య భారతంలో ఉద్రిక్త పరిస్థితులు  ఇప్పటికీ కొనసాగుతున్నాయి.  ఈశాన్య భారతంలో భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న చట్టం Armed Forces Special Powers Act (AFSPA) ఉపసంహరించుకోవాలనే అక్కడి రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల పలువురు ముఖ్యమంత్రులు సైతం ఏఎఫ్ఎస్‌పీఏను ర‌ద్దు చేయాల‌ని కేంద్రాన్ని కోరుగుతున్నారు. ఈ చ‌ట్టం ద్వారా ఇక్క‌డి ప్ర‌జ‌లు అణచివేత‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొంటున్నారు. 

Also Read:  Cold Wave: చలి చంపేస్తోంది బాబోయ్.. మైన‌స్ డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌త‌లు.. అధికారుల హెచ్చరిక‌లు

ఈ నేప‌థ్యంలోనే జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (NHRC) ఛైర్మ‌న్ జ‌స్టిస్ ఆరుణ్ మిశ్రా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశం వంటి నాగరిక సమాజంలో బూటకపు ఎన్‌కౌంటర్లకు ఆస్కారం లేదని ఆయ‌న పేర్కొన్నారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పలేమని వెల్ల‌డించారు. "మేము ఇలాంటి సమస్యను సాధారణీకరించలేము. ఈ చట్టం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మేము ఖ‌చ్చితంగా  చెప్పలేము. ఏదైనా ప్రత్యేక కేసు వస్తే అప్పుడు మేము ఆ కేసును పరిశీలిస్తాము" అని AFSPA గురించి అడిగినప్పుడు జ‌స్టిస్ ఆరుణ్ మిశ్రా  మీడియాకు వెల్ల‌డించారు. అలాగే, "మేము ఇక్కడ ఏ చట్టం యొక్క రాజ్యాంగబద్ధత గురించి చర్చించలేము, అది సుప్రీంకోర్టు నిర్ణయించాలి. ఇంకా, ఇది ఏ జిల్లాలో, ఏ సమయంలో వర్తింపజేయాలో ప్రభుత్వం సమీక్షించవలసి ఉంటుంది" అని ఆయ‌న పేర్కొన్నారు.  దేశంలో త‌క్ష‌ణ న్యాయం కోసమంటూ ప్ర‌త్యేక ప్రాంత‌మంటూ, స్థ‌ల‌మంటూ ఏదీ లేద‌నీ, చ‌ట్టం ప్ర‌కార‌మే అద‌రికి శిక్ష‌లు ప‌డ‌గాయ‌ని తెలిపారు. నిందితులను కోర్టులు విచారించి దోషులుగా నిర్థారించిన త‌ర్వాతే చ‌ట్టం ప్ర‌కారం శిక్షించ‌బ‌డాలి అని జ‌స్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. 

Also Read:  Omicran: మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌..

జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఈశాన్య భార‌త రాష్ట్రాలైన అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి ప‌బ్లిక్ ఓపెన్ హియ‌రింగ్ క్యాంపు నిర్వ‌హించింది. అసోంలోని  గౌహ‌తిలో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన ఈ క్యాంపు చివ‌రి రోజున (డిసెంబర్ 17)  NHRC ఛైర్మ‌న్ అరుణ్ మిశ్రా పై వ్యాఖ్య‌లు చేశారు. "జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓపెన్ హియరింగ్‌లో  భాగంగా 40 ఫిర్యాదుల‌ను స్వీకరించింది. ఇందులో  అసోం నుంచి 23 కేసులు, మణిపూర్ 13 కేసులు, అరుణాచల్ ప్రదేశ్ 1, నాగాలాండ్ 3 కేసులు ఉన్నాయి. ప‌లు నివేదిక‌లు ప‌రిశీలించిన అనంత‌రం ఇరు వ‌ర్గాల వాద‌న‌లు వినడంతో ఐదు కేసుల‌కు ప‌రిష్కారం ల‌భించింది. వీటిని ఇక్క‌డి మూసివేశాము" అని అధికారిక ప్రకటన పేర్కొంది.  ఇదిలావుండ‌గా, మోన్ జిల్లా ఘ‌ట‌న అనంత‌రం ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ AFSPA  తెర‌మీద‌కు వ‌చ్చింది. దీనిని ర‌ద్దు చేయాల‌ని పేర్కొంటూ చేస్తున్న నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. మేఘాల‌య సీఎంసంగ్మాతో పాటు నాగాలాండ్ సీఎం నీఫియు రియోతో సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు AFSPAని తొలగించాలని డిమాండ్ చేశాయి.

Also Read:  Omicron | అదే జరిగితే రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు

Follow Us:
Download App:
  • android
  • ios