Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టచ్ లో 25 మంది నేతలు.. తరుణ్ చుగ్

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే, తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదీ ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు. 

bjp state incharge tarunchugh comments on KCR, congress
Author
Hyderabad, First Published Nov 27, 2021, 7:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు ఢిల్లీలో షాక్ తగిలిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి tarun chugh అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికిప్పుడు electionsలు వచ్చినా కేసీఆర్ కు 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెరాస నుంచి 25 మంది నేతలు టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. 

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే, తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదీ ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు. 

తరుణ్ చుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కనీసం 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకరని అన్నారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో కె. చంద్రశేఖర్‌రావు గుణపాఠాన్ని అనుభవించారని బిజెపి జాతీయ నాయకుడు అన్నారు. వ్యవసాయ చట్టాలను ఒక వర్గం రైతులు వ్యతిరేకించారు. దీనిని అమలు చేస్తే, పెద్ద సంఖ్యలో రైతులు ప్రయోజనం పొందుతారని తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర కార్యవర్గంతో ముచ్చటించారు.

బీజేఎల్పీ నేత రాజాసింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, తమిళనాడు ఇంచార్జి పి.సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, జి.వివేక్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. శనివారం జరిగే సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు.

ఇదిలా ఉండగా,  కేంద్ర మంత్రి piyush goyalతో శుక్ర‌వారం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో paddy సేక‌ర‌ణ‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. ఖ‌రీఫ్‌, ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స్ప‌ష్టత ఇవ్వ‌ాలని తెలంగాణ ప్రతినిధి బృందం కోరింది. 

అంతకుముందు ఈ నెల 23న మంత్రి ktr నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత రాకపోవడంతో కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ రోజు తెలంగాణ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసింది. 

తలొగ్గని కేంద్రం .. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణకు మొండిచేయి, యాసంగిలో వరి వద్దని కుండబద్ధలు

కాగా.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరాటం  చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది టీఆర్ఎస్. కేంద్రం నుండి రెండు మూడు రోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

వరి ధాన్యంపై తాడోపేడో తేల్చుకొనేందుకు కేసీఆర్ delhi tourకి సైతం వెళ్లొచ్చారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశానికి  సంబంధించి ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కూడా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. రా రైస్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే  ఉత్పత్తి అవుతుందని తెలంగాణ సర్కార్ చెబుతుంది.. కేంద్రం ధాన్యం కొనుగోలుకు సిద్దంగా లేనందునయాసంగిలో వరి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios