Revanth Reddy: పార్లమెంటులో వివాదం.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫైర్.. ఇంతకీ రేవంత్ ఏమన్నారు?
పార్లమెంటులో ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వివాదం రగులుకుంది. డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలతో ఈ గొడవ మొదలైంది. ఇందులో తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న రేవంత్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. బీజేపీ జాతీయ నాయకత్వం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడింది.
హైదరాబాద్: పార్లమెంటులో డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందీ బెల్ట్ రాష్ట్రాలను ఉద్దేశించి గోమూత్రం రాష్ట్రాలు అని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణాదిలో కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ సీఎంగా ప్రమాణం తీసుకోబోతున్న రేవంత్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా విమర్శించింది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఉత్తరాది, దక్షిణాది తేడాలపై రేవంత్ రెడ్డి ఏ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు?
గతంలో ఓ సారి రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ అప్పటి సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. కేసీఆర్‌ది బీహార్ డీఎన్ఏ అని, దానికంటే గొప్పదైనా తెలంగాణ డీఎన్ఏ తనదని అన్నారు. కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆయన బీహార్ కంటే తెలంగాణ గొప్పదనే పోలిక తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాలు సోషల్ మీడియాలో పోస్టు చేసి మండిపడ్డారు.
Also Read: MP Seats: తెలంగాణలో ఏడు ఎంపీ సీట్లు ఖాళీ.. వివరాలివే
ఆ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ బీహార్‌కు చెందిన కుర్మీ సామాజిక వర్గానికి చెందినవారని, వారి కుటుంబం బీహార్ నుంచి విజయనగారినికి వలస వచ్చిందని, ఆ తర్వాత తెలంగాణకు మారిందని అన్నారు. అందుకే ఆయనలో బీహార్ డీఎన్ఏ ఉంటుందని, కానీ, తనలో ఉత్తమమైన తెలంగాణ డీఎన్ఏ ఉంటుందని వివరించారు. బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ బెటర్ అని కామెంట్ చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్‌లు ఏకీభవిస్తారా? లేక కాంగ్రెస్ పార్టీతో కూటమిని తెంచుకుంటారా? కనీసం ఓబీసీ సీఎంను అయినా చేయాలని డిమాండ్ చేస్తారా? అని ట్వీట్లు చేశారు.
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్
రేవంత్ రెడ్డి తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వెళ్లిన ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు అందించి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యాక తెలంగాణకు వచ్చారు.